తెలుగు సినిమా ఇండస్ట్రీలో RSS విభాగం

August 7, 2018

తెల్లచొక్కా.. ఖాకీ నిక్కరు.. చేతిలో కర్ర.. ఇలాంటి వ్యక్తి కనిపించగానే ఠక్కున RSS అనేస్తాం. ఇది ఒకప్పటి మాట. ఇటీవల ప్యాంట్ వేసుకుంటున్నారు. ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా మరో ముందడుగు కూడా వేస్తోంది రాష్ట్రీ స్వయం సేవక్ (RSS). దేశభక్తుల్లో వీళ్లు వేరయ్యా అనే విధంగా ఉంటారు. అంటే మిగతా వాళ్లతో పోల్చితే కొంచెం ఎక్కువగా భక్తి ప్రవర్తులతోపాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మారుతున్న కాలంతోనూ కొత్త తరానికి కూడా RSS విశిష్టత, సంప్రదాయాలు, దేశభక్తి, సామాజిక కోణం పరిచయటం కోసం వెండి తెరను అవకాశంగా మాలుచుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో RSS విభాగం ఒకటి పని చేస్తుందని ఇటీవల సినిమాలను చూస్తే అర్థం అవుతుంది.

జై జవాన్ మూవీ :
ఈ మూవీలో హీరో RSS కార్యకర్త. ఈ సేవక్ నుంచే ఓనమాలు నేర్చుకుంటాడు. దేశభక్తిని పునికి పుచ్చుకుంటాడు. ఈ సినిమా మొత్తం RSS భావజాలం చుట్టూనే తిరుగుతుంది. ప్రతి ఫ్రేమ్ లోనే కాదు.. హీరో ఐడియాలజీ, ఆలోచనలు కూడా RSS కార్యకర్తలాగే ఉంటాయి. హీరోగా నటించిన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించాడు. ఇలాంటి హీరో.. RSS భావజాలం స్టోరీని ఎంచుకోవటం డేరింగ్ స్టెప్. అంత మార్కెట్ లేని సాయిధరమ్ తేజను హీరోగా పెట్టి.. 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కటం.. అందులోనూ ఓ వర్గానికి మాత్రమే కనెక్ట్ RSS బ్యాగ్రౌండ్ స్టోరీని ఎంచుకోవటం చూస్తుంటే ఇది పక్కా నిజం స్పష్టం అవుతుంది.

సాక్ష్యం సినిమాలోనే అదే వాసనలు :
ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సాక్ష్యం మూవీలోని కొన్ని డైలాగ్స్ కూడా RSSకి కనెక్ట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. శివుడు, పంచభూతాలు, ప్రకృతి, ఆవు ఇలా అన్ని అంశాల్లోని భారతీయ సనాతన ధర్మం, దేశ పరిరక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ప్రకృతికే ఆవు అవసరం అని చెప్పటంతోపాటు.. క్లయిమాక్స్ లో హీరో గుర్రం, ఏనుగు, పులిపై కాకుండా ఆవుపై రావటం కూడా నేటి పరిస్థితులతోపాటు ముక్కోటి దేవతులు ఆవులో ఉన్నాయి చెబుతోంది. RSSకి దగ్గరగా ఉంటే వారికి ఈ కథలోని అంతర్లీనం ఏంటో ఇట్టే అర్థం అవుతోంది.

సినిమాల్లోకి RSS అవసరమా :
నూటికి నూరు శాతం అవుననే అంటున్నారు RSS అభిమానులు. నేటి గ్లోబల్ తో కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. ఇలాంటి వారికి ఈజీగా చెప్పగలిగిన మాధ్యమం వెండి తెర. తన ఇష్టమైన హీరో ఏ క్యారెక్టర్ లో కనిపిస్తే.. దాన్ని అనుకరించే అభిమానులు వేలు, లక్షల్లో ఉంటారు. నెగెటివ్ అనేది కాకుండా.. పాజిటివ్ వైబ్రేషన్స్ ను సినీ మాధ్యమం గట్టిగా, బాగా తీసుకెళ్లవచ్చు. అందుకే ఈ మార్గంలో కొత్త తరహాగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

సౌత్ ఇండియాలోనే మళయాళం, తమిళం, కన్నడంలో ఒక్కటంటే ఒక్క RSS బ్యాగ్రౌండ్ స్టోరీ సినిమా రాలేదు.. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలోనే రెండు వచ్చేశాయి. ఈ అడుగులు తెలుగు సినీ ఇండస్ట్రీని ఎటు వైపు తీసుకెళతాయో చూడాలి…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.