తుస్సుమన్న తుపాకీ రెడ్డీ..

December 22, 2018

తుపాకీని చూడగానే భయమేయాలి.. పేలితే ప్రాణాలు పైకిపోతాయ్ అని.. ఈ తుపాకీ మాత్రం ఎప్పుడూ పేలదు.. పేల్చేదమ్మూ లేదు. నలుగురికీ కాంపిటీషన్ ఇస్తున్నామనే ఫీలింగ్ తప్పితే.. సొంతానికి పేలని తుపాకీ ఉంటే ఎంత లేకపోతే ఎంత. బొమ్మ తుపాకీతో బెంబేలు ఎత్తిస్తున్న కాలంలో చేతిలోని తుపాకీ పేలకపోగా.. రాజకీయ జీవితాన్నే డైలమాలో పడేసుకున్నారు IV Reddy. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పదేళ్లుగా పార్టీ టికెట్ కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తూనే.. విఫలం అవుతున్న ఐవీ రెడ్డి.. మరోసారి ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావటం విశేషం.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ఐవీ రెడ్డి (NRI) టికెట్ ఆశలు గల్లంతు అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ మారటమే ఇందుకు కారణం. జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న ఐవీ రెడ్డిని కాదని.. మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించటంతోనే రెడ్డిగారికి చెక్ పెట్టినట్లే అని స్పష్టం అవుతోంది. అన్నా రాంబాబుకి గిద్దలూరులో మంచి పట్టు ఉండటం, ఇంజినీరింగ్ కాలేజీల రూపంలో యూత్ గా బాగా కనెక్ట్ కావటం, ఆర్థికంగానూ మూడు, నాలుగు నియోజకవర్గాలకు డబ్బు సర్దుబాటు చేయగల సమర్థత ఉండటం కలిసి వచ్చే అంశం. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన అశోక్ రెడ్డి.. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఐవీ రెడ్డి అప్పుడప్పుడు బాధ్యతలు పర్యవేక్షిస్తూ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మాత్రం ఘోరంగా విఫలం అయినట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ మారినప్పుడు అయినా.. స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నారా అంటే అదీ లేదు. చెప్పేవాళ్లు లేకపోయినా.. కనీసం వెతికి పట్టుకుని సలహాలు, సూచనలు తీసుకున్నా ఈపాటికి టికెట్ కన్ఫామ్ అయ్యేది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే టాక్. పెద్ద పెద్ద మహామహులే నలుగురికి ఐదుగురు సూచనలు, సలహాలు తీసుకుంటూ.. నాలుగు టీవీల్లో కనిపిస్తూ లాంగ్ గోల్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటూ వస్తున్నారు. ఐవీ రెడ్డి దోరణి మాత్రం విచిత్రం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నేతలే అంటారు. ఏదో తురుంఖాన్ లా బిహేవ్ చేస్తాడని.. మాటల్లో తప్పితే చేతల్లో కనిపించదనే టాక్ నడుస్తుంది. దీనికితోడు NRI అనే బిల్డప్ మరీ ఎక్కువగా చూపిస్తుంటాడనే చురకలూ అంటిస్తున్నారు.

10, 15 ఏళ్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతర రాజకీయ, పార్టీ పదవుల్లో ఉన్నోళ్లు కూడా తుపాకీ రెడ్డి బిల్డప్ ముందు బలాదూర్ అంటున్నారు. ఆయనకు ఎవరు రాజకీయ సలహాలు, సూచనలు ఇస్తున్నారో కూడా అర్థం కావటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఏ పార్టీ కూడా ఇన్ని అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇవ్వదని.. అలాంటి అవకాశాలు ఐవీ రెడ్డికి వచ్చినా ఉపయోగించుకోలేకపోవటం అనేది ఆయన తెలివితక్కువ తనమే అనే టాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు గిద్దలూరు రాజకీయాల్లో బహిరంగంగా వినిపిస్తున్న మాట. ఓవరాల్ గా కరెంట్ సిట్యువేషన్ చూస్తుంటే మాత్రం.. ఐవీ రెడ్డి ఆ తుపాకీ సైట్ ఏదో చూసుకుంటూ.. అమెరికా వెళ్లి వ్యాపారాలు చేసుకుంటే బెటర్ అని టాక్ బలంగానే వినిపిస్తూనే ఉంది.. ఇంట్లో పేలని తుపాకీ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.