డ్రంక్ అండ్ డ్రైవ్ : నీకో దండం.. పార్టీ గీర్టీ వద్దు.. ఇంటికి పోతా మామా

July 18, 2018

నలుగురు ఫ్రెండ్స్ కలిశారు.. ఇంకేముందీ పార్టీ. మంచి ప్యాకేజీతో కొత్త ఉద్యోగం వచ్చింది ఇంకేముందీ పార్టీ.. ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది.. ఇంకేముందీ పార్టీ. బోనస్ వచ్చింది.. జీతం పెరిగింది.. కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది.. ఇంకేముందీ పార్టీ. వీక్ అని లేదు.. వీకెండ్ అని లేదూ ఐటీ పీపుల్ అని కూడా కాదు.. ఎవరైనా సరే నలుగురు కలిస్తేనో.. అది సంతోషం అయినా.. బాధ అయినా నాలుగు పెగ్గులు, నాలుగు బీరు బాటిల్స్ ఓపెన్ చేసి.. ఓ నాలుగు గంటలు అందరూ మాట్లాడుకుంటూ చాలు.. బాధలు తగ్గుతాయి.. సంతోషం వెల్లువిరుస్తుంది. హైదరాబాద్ లో ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు అంతా గప్ చిప్. మామా ఓ పెగ్గు వేస్తావా.. బావా ఓ బీర్ కొడదామా అంటే వద్దు బాబోయ్ అంటున్నారు. వీడెవడండీ బాబూ పార్టీ ఇస్తానంటే వద్దు అంటున్నాడు అంటూ అడిగినోడు సిల్లీ చూడొచ్చు కానీ.. వద్దన్నోడి బాధ వెనక ఓ భయంకరమైన విషాదభరితమైన కథ ఒకటి ఉంటుందని గుర్తించటం కష్టం అవుతుంది. అదేంటో తెలుసా.. డ్రంక్ అండ్ డ్రైవ్..

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఇప్పుడు అంతర్జాతీయంగా.. అంతర్జాలంలో చాలా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇటీవల ఓ ఫ్రెండ్ అమెరికా నుంచి హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే ఉద్యోగికి చాటింగ్ లోకి వచ్చాడు. అది వీకెండ్ టైం. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు. వారి మధ్య ఇలా జరిగింది సంభాషణ. ఇది ఇప్పుడు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వైరల్ అవుతుంది.

వీకెండ్ ఎంజాయ్ కు రెడీ అవుతున్నావా అంటూ అమెరికా ఫ్రెండ్ అడిగితే.. ఏం లేదు మామా.. ఏడు గంటల వరకు ఆఫీస్ లోనే ఉండి వెళ్లిపోతాను అన్నాడు. అదేంటీ అంటే.. డ్రంక్ అండ్ డ్రైవ్ మామా అన్నాడంట. ఏం తప్పించుకుని వెళ్లొచ్చు కదా అంటే.. నీకు తెలియదు.. ఎప్పుడు, ఎక్కడ స్పాట్ పెడతారో అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. పోనీలే ఓ బీరు కొట్టి అయినా వెళ్లు అన్నాడంట.. అబ్బే.. ఒక్క బీరు కాదు.. అర బీరు (స్మాల్ బాటిల్) కొట్టినా కౌంట్ మాత్రం తగ్గటం లేదు. అసలు కౌంట్ తో సంబంధం లేదు.. బాడీకి స్ప్రే వాసన ఉన్నట్లే.. శరీరం నుంచి ఆల్కాహాల్ స్మెల్ వస్తే చాలు.. బుక్ చేసేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఇండియన్ ఫ్రెండ్. ఏం లేదు మామా.. మందు కొట్టటం లేదు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్లు ఊరికి వెళ్లినప్పుడో లేక నేను ఊరికి వెళ్లినప్పుడో కొడుతున్నా.. ఏం ఎంజాయ్ లేదు.. పోయే దారిలో నాలుగు పబ్స్… ఎనిమిది బార్లు… ఆరు వైన్స్ ఉన్నా ఆ వైపు చూడటం లేదు అంటూ నిట్టూర్చాడంట. మీరి మీ ఆఫీస్ వాళ్లు అంతా ఇంతేనా అంటే.. ఎవడికి వాడు గుంబనంగా ఉంటున్నారు.. సప్పుడు చేయకుండా ఇంటికి పోతున్నారు అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారంట. ఇంట్లో తాగనీయరు.. బారుకి వెళితే.. ఆ చుట్టుపక్కల అన్ని రూట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు.. ఇంకెక్కడికి వెళతాం.. ఇంకెక్కడి కిక్కు మామా.. నోరు మూసుకుని పడుకోవటమే అంటూ తన బాధను వ్యక్తం చేశాడు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.