టీఆర్‌ఎస్‌కి 50 శాతం ఓట్లు.. కూటమికి 32 శాతం ఓట్లు… బాబు ఢమాల్‌..!!!

December 3, 2018

కొత్త సర్వే వచ్చింది. ఎలాంటి మార్పూ లేదు. అదే మాట చెప్పింది. నెలరోజుల గ్యాప్‌లోనే ఇది మరో సర్వే.. సంస్థలు మారినా, జాతీయ మీడియా అయినా, ప్రాంతీయ సర్వే అయినా, హస్తిన నుండి వెలువడే జాతీయ స్థాయి సంస్థ అయినా, హైదరాబాద్‌ నుండి సేకరించిన సర్వే అయినా తీరు మారలేదు.. పట్టం టీఆర్‌ఎస్‌కే. అధికారం నిలబెట్టుకునేది కేసీఆర్‌ సర్కారే.. తెలంగాణ సమాజం కోరుకుంటోంది గులాబీ దళపతినే.

ఈ సర్వేలో టీఆర్‌ఎస్‌కి 94-104, ప్రజాకూటమికి 16-21 స్థానాలు వస్తాయని తేల్చిపారేసింది సీపీఎస్‌ సర్వే. ఇటు ఎమ్‌ఐఎమ్‌ తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంటుందని వివరించింది. మొదటి నుండి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇదే చెబుతున్నారు. తమకు వంద స్థానాలు తగ్గవని, అధికారం తమదే అని ఆయన ఢంకా బజాయించి మరీ వివరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఓ సర్వే పూర్తి అబద్ధమని, అది అవాకులు, చెవాకులు పేల్చే సర్వే అని తేల్చిపారేశాడు కేసీఆర్‌. తాజాగా వెలువడిన సర్వేతో ఇది పక్కా నిజం అని తేలిపోయింది.. దీంతో, టీఆర్‌ఎస్‌ శ్రేణులలో ఆనందం వెల్లువెత్తుతుండగా, కూటమి నేతలు డల్‌ అయ్యారు..

ఈ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కి ఏకంగా 49.7 శాతం ఓట్‌ బ్యాంక్‌ దక్కుతుందని వివరించగా, ప్రజా కూటమికి కేవలం 32.7 శాతం మాత్రమే వస్తుందని స్పష్టంగా తేల్చి చెప్పింది. గత కొన్నాళ్లుగా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా, టీఆర్‌ఎస్‌ అదే శాతం ఓట్‌ బ్యాంక్‌ని దక్కించుకుంటోంది.. అదే విషయాన్ని మరోసారి ప్రూవ్‌ చేసింది ఈ సర్వే..

ఈ ఎన్నికలు తెలంగాణకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో జాతీయ మీడియా కూడా ఇక్కడే ఫోకస్‌ వేసింది. మూడున్నర దశాబ్దాల శతృత్వాన్ని పక్కనపెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో జట్టు కట్టడం తెలంగాణ ఓటరు సహించలేక పోతున్నాడు. అందుకే కూటమికి సరైన సమాధానం చెప్పపోతున్నాడని వివరిస్తున్నారు పరిశీలకులు.. ఈ సర్వేతో చంద్రబాబు అమరావతి కరకట్టకు మరోసారి పరుగులు తీయడం తప్పదని చెబుతున్నారు..

బాబును తెలంగాణ సమాజం వద్దు బాబోయ్‌ అని చెబుతున్నా ఆయన ఇలా దండయాత్రలా బయలుదేరడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత బాబు తెలంగాణ బోర్డర్‌లోకి అడుగుపెట్టాలంటే భయపడతాడని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమాగా ఉన్నారు.. మరో పది రోజుల్లో ఏం జరగనుందనేది తేలిపోనుంది. గోల్కొండ కోటపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.