జయరాం కేసు విచారణలోకి అమెరికా పోలీసులు : శిఖాను FBI హ్యాండిల్ చేస్తుందా?

February 8, 2019

జయరాం కేసు విచారణలోకి అమెరికా పోలీసులు : శిఖాను FBI హ్యాండిల్ చేస్తుందా?
చిగురుపాటి జయరాం హత్య కేసు కీలక మలుపు తీసుకుంటుందా.. ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుతో మొత్తం కేసు అమెరికా పోలీసుల చేతుల్లోకి వెళ్లబోతున్నదా.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నదా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల పోలీసుల తీరే కారణం అంటున్నారు. కేసు విచారణలో తెలంగాణలోని ఇద్దరు పోలీసులు నిందితులకు సహకరించటం ఒకటి అయితే.. ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరికి నాలుగు రోజుల్లోనే ఏపీ పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వటంపైనా తలెత్తిన వివాదంతోపాటు జయరాం భార్య పద్మశ్రీ అనుమానాలతో ఇచ్చిన కంప్లయింట్ కూడా కీలకంగా మారింది.

  • ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జయరాం భార్య పద్మశ్రీ.. ఇప్పుడు తెలంగాణ పోలీసులపైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఓ ఏసీపీ, ఓ సీఐ ప్రత్యక్షంగా ఈ కేసులో ఇన్వాల్వ్ కావటంతో ఇది జాతీయ స్తాయిలో చర్చనీయాంశం అయ్యింది.
  • శిఖాచౌదరికి ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నిస్తున్న ఆమె.. విచారణ పారదర్శకంగా సాగాలని డిమాండ్ చేస్తోంది.
  • చిగురుపాటి జయరాం అమెరికా సిటిజన్. అమెరికా పౌరుడు. దీంతో ఆమె ఈ హత్య, కేసు వివరాలను ఎంబసీకి ఇవ్వనుంది.
  • జయరాం పాస్ పోర్ట్ ఎంబసీలో సరెండర్ చేయనుంది.
  • హత్య జరిగి వారం రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు కూడా జయరాం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆమెకు చూపించలేదు.. కాపీ ఇవ్వలేదు. దీనిపై పోలీసులు మీనవేషాలు లెక్కిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఎంబసీకి కంప్లయింట్ చేయనుంది.
  • ఇప్పటి వరకు జరిగిన విచారణ వివరాలు, ఏం జరిగింది.. ఏం జరుగుతుంది అనే విషయాలను కూడా పద్మశ్రీ ప్రశ్నిస్తున్నా పోలీసులు సమాధానం చెప్పకపోవటంతో ఆమె అమెరికా ఎంబసీకి వినతిపత్రం ఇవ్వబోతుంది. ఇక్కడే కేసులు కీలక మలుపు తిరగబోతున్నట్లు సమాచారం.
  • అమెరికా ఎంబసీకి పద్మశ్రీ కంప్లయిట్ చేయగానే.. అక్కడి నుంచి ఏపీ, తెలంగాణ పోలీసులకు నోటీసులు రాబోతున్నాయి.
  • తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇచ్చే వివరాలపై అమెరికా ఎంబసీ సంతృప్తి చెందకపోతే మాత్రం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
  • ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగితే మాత్రం శిఖాచౌదరికి మూడినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. FBI హ్యాండిల్ చేస్తే మాత్రం.. ఈ కేసులో శిఖా పూర్తిగా ఇరుక్కుపోయినట్లే అంటున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.