జగన్ సీఎం అయితే.. మొదటి రోజే సంచలన నిర్ణయం

May 11, 2019


ఏపీ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయితే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబుతున్నారా.. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలన ప్రకటన చేయబోతున్నారు. ఇంత వరకు ఏ సీఎం తీసుకోని నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది.
సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. క్రమ శిక్షణ పాటించటం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కొత్త మంత్రివర్గంలో కనీసం మరో ఐదుగురు మంత్రులు సైతం ఒక్కరూపాయి జీతం తీసుకుంటారు. దీంతో పాటు రాష్ట్రంలో ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచేదిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
జగన్ సీఎం కావడం ఖాయమైనట్లు భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కొన్ని కీలక, సంచలన నిర్ణయాల దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. జగన్ ను ప్రసన్నం చేసుకునే దిశగా కొందరు అధికారులు ఇందుకు జగన్ కు సహకరిస్తున్నారు. మొత్తం మీద జగన్ ఒక్క రూపాయి జీతం తీసుకుంటే.. మంత్రులు అధికారులూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తూ.. నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తారని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. భారీ ఎత్తున ప్రచారం అయితే జరిగిపోతుంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.