చూసుకుని ఎక్కండి : పిల్లలు ఏడిస్తే విమానం దించేస్తారు

August 9, 2018

పిల్లలు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది అల్లరి, ఏడుపు. పిల్లోడు ఏడవకపోతే గిల్లి మరీ ఏడిపిస్తారు.. ఎందుకంటే అప్పుడప్పుడు పిల్లలు ఏడవాలని పెద్దలు చెబుతారు.. అదే పనిగా ఏడుస్తుంటే అనారోగ్యం అని భావించి ఆస్పత్రికి తీసుకెళతాం.. ఆరోగ్యంగా ఉంటే అల్లరి చేస్తాడు.. ఆకలి అయితే ఏడుస్తాడు.. పిల్లలు ఇలా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు.. ప్రపంచంలోని ఏ దేశంలోని పిల్లలు అయినా ఇలాగే ఉంటారు.. కానీ ఆ విమాన సంస్థ మాత్రం లోకానికి విరుద్ధంగా ప్రవర్తించింది. మా విమానంలో పిల్లలు ఏడవ కూడదు అంటోంది. పిల్లలతో విమానం ఎక్కే చిన్నారులకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తాం ఏడిస్తే మాత్రం దించేస్తాం అని చెప్పటమే కాదు.. చేసి చూపించింది. ఇలాంటి తుగ్లక్ నిర్ణయాన్ని అమలు చేసి చూపించి మరీ తన పైశాచికత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది బ్రిటీష్ ఎయిర్ లైన్స్.

అది బ్రిటిష్ ఎయిర్ లైన్స్. నెంబర్ BA-8495. లండన్ నుంచి బెర్లిన్ వెళుతుంది. ఇదే విమానంలో తన మూడేళ్ల చిన్నారితో విమానం ఎక్కింది భారతీయ కుటుంబం. విమానం ఎక్కిన చిన్నారి మొదట ఆడుకుంటూనే ఉన్నాడు. నవ్వుతూనే ఉన్నారు. అయితే కేబిన్ సిబ్బంది సరదా కోసం ఆ చిన్నారిని ఆట పట్టించారు. కొత్త వ్యక్తులు, ఎప్పుడూ చూడని డ్రస్సుల్లో కనిపించే సరికి పిల్లోడు భయపడ్డాడు. ఏడుపు అందుకున్నాడు. ఏడుపు ఆపటానికి పేరంట్స్ తోపాటు.. వారి పక్కనే కూర్చున్న మరో భారతీయు కుటుంబం కూడా ప్రయత్నించింది. బిస్కెట్లు, చాక్కెట్లు ఇచ్చి సముదాయిస్తున్నారు. ఏడుపు తగ్గుతూ ఉంది. అదే సమయంలో కేబిన్ సిబ్బంది బయటకువచ్చారు.

ఏడుపు ఆపకపోతే కిటికీ నుంచి బయట పడేస్తా.. విమానం పైన ఎక్కిస్తా అంటూ బెదిరించారు. దీంతో మరింత భయపడిన చిన్నారి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. దీంతో మరింత అసహనానికి గురైన విమాన పైలెట్లు, సిబ్బంది ఆ కుటుంబంపై వాదనకు దిగారు. ఏడుపు ఆపటానికి రెండు నిమిషాల టైం ఇచ్చారు. ఇంత భయపెట్టిన తర్వాత చిన్నారి ఏడుపు ఎలా ఆపుతాడు అంత తొందరగా. ఆపడు. ఆపలేం కూడా. అలాగే ఏడుస్తున్నాడు. దీంతో గాల్లోకి ఎగరాల్సిన విమానాన్ని కిందకి దించారు. లండన్ ఎయిర్ పోర్ట్ లో దించేసి విమానం వెళ్లిపోయింది.

ఈ ఘటనతో షాక్ అయిన భారతీయ కుటుంబం లండన్ ఎయిర్ లైన్స్ కు కంప్లయింట్ చేసింది. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పిల్లల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించిన పైలెట్ల మానసిక స్థితిపైనా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పిల్లల ఏడుపును అసహనంగా ఫీలయిన వారు.. విమానంలోని 200 మంది ప్రయాణికుల ప్రాణాలపై ఎలా శ్రద్ధ పెట్టగలరూ అంటూ నిలదీస్తున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.