చంద్రబాబు దీక్షతో.. తెలంగాణ కాంగ్రెస్ సమావేశం వాయిదా పడిందా..

February 11, 2019

ఏంటీ అవాక్కయ్యారా.. అబద్దమో.. నిజమో.. ఏమోగానీ.. గాంధీభవన్ లోనే కాకుండా మిగతా పార్టీల్లోనూ ఇదే జరుగుతుంది. ఏంటీ అంటారా.. హైదరాబాద్ గాంధీభవన్ లో జరగాల్సిన తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం వాయిదా పడటం. అవును.. దీనికి కారణం ఏంటీ అని ఆరా తీసినోళ్లకు విచిత్రమైన డౌట్స్ తోపాటు.. కఠోరమైన వాస్తవాలు ఇవే అనే డైలాగ్స్ వినిపించాయి. మా పార్టనర్.. తెలుగు కాంగ్రెస్ పార్టీ అధినేత ఢిల్లీలో దీక్ష చేస్తుంటే మేం ఎలా సమన్వయ కమిటీ సమావేశం పెట్టుకుంటాం అనే సెటైర్లు పేలుతున్నాయి అంట. మరో కాంగ్రెస్ నేత అయితే.. తెలుగు దేశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు మా అధినేత రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యి మద్దతు ప్రకటించారు. ఇలాంటి టైంలో సమన్వయం ఎలా కుదురుతుంది అంటూ చెప్పుకొచ్చారు.
వాస్తవంగా అయితే గాంధీభవన్ లోని పీసీసీ సమన్వయ సమావేశంలో రాబోయే లోక్ సభ ఎన్నికలపై చర్చించాల్సి ఉంది. 11, 12 తేదీల్లో జరగాల్సిన ఈ సమావేశాలను 16, 17 తేదీలకు మార్చారంట. ఢిల్లీలో రాహుల్ – చంద్రబాబు చర్చల తర్వాత పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగేది తెలుస్తుంది అంటూ యువ నేతల్లో కొందరు చురకలు అంటిస్తున్నారు. వీళ్లు మారరు.. మార్పు రాదు.. లోక్ సభలో ఒక్కసీటు కాదు కదా.. పోటీ చేసే కాంగ్రెస్ లీడర్ దొరకటం కూడా కష్టమే ఇలా ఉంటే అంటూ తిట్టిపోసుకుంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు.. ఏమైనా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి మంచి పునాది అయితే పడుతుంది రెండు రాష్ట్రాల్లో…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.