గబ్బర్‌ సింగ్‌ బ్యాచ్‌ మద్దతు ఆ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకే….!!!

December 1, 2018

ఎన్నికల వేడి గంటగంటకు పెరుగుతోంది. మరి కొన్ని రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలలో గెలవడానికి ఎవరు వ్యూహాలు వారు పన్నుతున్నారు. తమకు మద్దతుగా తెచ్చుకుంటున్నారు.. వీలయితే హీరోలు, హీరోయిన్‌లు లేదంటే కామెడీ ఆర్టిస్టులను సైతం తమ ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. అయితే, బానోతు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి శంకర్‌ నాయక్‌కి గబ్బర్‌సింగ్‌ అంత్యాక్షరి టీమ్‌ మద్దత ప్రకటించింది. ఆయన కోసం ఇంటింటికీ ప్రచారం చేసింది గబ్బర్‌సింగ్‌ కామెడీ టీమ్‌.

కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్‌ను గెలిపించాలంటూ గబ్బర్‌సింగ్ సినిమా అంత్యాక్షరి టీమ్ పిలుపునిచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఈ గ్యాంగ్ మహబూబాబాద్‌లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో పాటు ఎంపీ సీతారం నాయక్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించింది.

ఇక గబ్బర్‌సింగ్ గ్యాంగ్ మాట్లాడుతూ శంకరన్న మంచి వ్యక్తి కావడంతో హైదరాబాద్ నుంచి మహబూబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు తమకు చాలా బాగా నచ్చాయని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ గెలిస్తేన అభివృద్ధి కొనసాగుతుందని, లేదంటే స్తంభించిపోతుందని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసి రాష్ర్టాన్ని సాధించిన నాయకత్వాన్ని గెలిపించుకోవాలని గబ్బర్‌ సింగ్‌ టీమ్‌ పిలుపునిచ్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ఎంతో లబ్దిపొందిన సినీ హీరోలు, కుటుంబాలు ఉన్నా.. వారెవరూ ముందుకు రాలేదు టీఆర్‌ఎస్‌ కోసం.. కానీ, గబ్బర్‌సింగ్‌ టీమ్‌ మాత్రం గులాబీ రంగుకే జై కొట్టడం విశేషం.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.