కేసీఆర్‌కు అడ్డుపడతావా….?? రేవంత్‌ రెడ్డికి ఈసీ వార్నింగ్‌….!!

December 2, 2018

కొడంగల్‌పై దండయాత్ర మొదలయింది.. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి కొడంగల్‌ గడప దాటకుండా అడ్డుకోవడమే టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గీసిన స్కెచ్‌కు రేవంత్‌ రెడ్డి విలవిలలాడుతున్నాడు. రెండు రోజులుగా కొడంగల్‌కే పరిమితం అవుతున్నాడు. ఇప్పటిదాకా టీ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా భావించిన ఆయనకు మైండ్‌ బ్లాంక్‌ అవుతోంది. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏం జరుగుతుందో అర్ధం కాక షాక్‌ అవుతున్నాడు రేవంత్‌ రెడ్డి.

కేటీఆర్‌ అడుగుపెడితే కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి వర్గం షేక్‌ అయింది. ఆయన రోడ్‌షోకి వచ్చిన జనాదరణ చూసి షాక్‌ అయ్యారు రేవంత్‌ అనుచరులు.. కొడంగల్‌ మొత్తం కేటీఆర్‌ కోసం క్యూ కట్టారు.. ఆ తర్వాత హరీష్‌ రావు అక్కడికి వస్తే భయపడడం రేవంత్‌ రెడ్డి వంతయింది.. ఈసారి కొడంగల్‌ రహదారలన్నీ స్తంభించిపోయాయి..

తాజాగా కేసీఆర్‌ ఈ నెల 4వ తేదీన కొడంగల్‌లో ప్రచారానికి వస్తున్నారు.. నిన్నటిదాకా షేక్ అయిన రేవంత్‌ రెడ్డి గుండెలు ఒక్కసారిగా అదిరిపోతున్నాయి. ఈ దెబ్బతో తన రాజకీయ జీవితం అవుట్‌ అవుతుందని భావించిన రేవంత్‌ రెడ్డి కొత్త ఎత్తుగడకు ప్లాన్‌ చేశాడు. కేసీఆర్‌ని కొడంగల్‌లో అడుగుపెట్టనీయబోమని ఆయన రచ్చ చేశారు. కేసీఆర్‌ పర్యటనను అడ్డుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

వారి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ అధికారి రజత్‌ కుమార్‌ తెలంగాణ డీజీపీకి కీలక ఆదేశాలు పంపింది. రేవంత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలుసుకోవాలని, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. కొడంగల్‌లో 4న కేసీఆర్‌ ఎంటర్‌ కాబోతున్నారు. రేవంత్‌ రెడ్డి ఓటమికి గంట మోగించనున్నారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు రేవంత్‌ రెడ్డి ఓటమి అంచున నిలబడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కాంగ్రెస్‌ నేతలే భావిస్తున్నారు.. మొత్తమ్మీద, కేసీఆర్‌ వేసిన స్కెచ్‌లో రేవంత్‌ రెడ్డి గిలగిలా కొట్టుకుంటున్నారు… ఆ వలనుండి ఆయన బయటపడతారా.?? అదంత సులువు కాదని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రేవంత్‌ గట్టునపడడం కష్టమని రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.