కూకట్‌పల్లి అంటే కమ్మలేనా చంద్రబాబు.. మేమూ ఉన్నాం….!!!

December 1, 2018

తెలంగాణ వ్యాప్తంగా మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి 13 నియోజకవర్గాలు కేటాయించింది కాంగ్రెస్‌. అందులో 6 స్థానాలు ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మిగిలిన ఏడు స్థానాలు మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, ఖమ్మంలో ఉన్నాయి. మెజారిటీ స్థానాలు ఇక్కడే కేటాయించడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో సీమాంధ్ర నుండి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారనే భావనతో ఆయన పట్టుబట్టి మరీ ఎక్కువ స్థానాలను దక్కించుకున్నారట.. ఇక్కడ తాము నిలబడితే చాలు గ్యారంటీ గెలుపు అని చంద్రబాబు యోచనట. అందుకే, కూకట్‌ పల్లి నియోజకవర్గం నుండి తన బావమరిది హరికృష్ణ, టీడీపీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు మనవరాలు అయిన నందమూరి సుహాసినిని ఇక్కడి నుండి బరిలోకి దింపారు చంద్రబాబు.. ఈ స్థానంలో దాదాపు కమ్మ సామాజిక వర్గం ఓటర్లే సుమారు 70-80 వేల మంది ఉంటారని సమాచారం. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నారట..

అయితే, కూకట్‌పల్లి అంటే కమ్మోళ్లే కాదు…. మేమూ ఉన్నాం అంటున్నారు ఇతర సామాజికవర్గం ఓటర్లు.. గత ఎన్నికలలో ఏపీని చంద్రబాబు అయితే బాగా డెవలప్‌ చేస్తారని ఓటు వేస్తే అభివృద్ధి చేస్తారని భావిస్తే అమరావతిని భ్రమరావతిగా మార్చారని, రాజధానిని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయడం వెనుక తన సామాజిక వర్గం బాగోగులే ఉన్నాయని భావిస్తున్నారు ఇతర సామాజిక వర్గం ప్రజలు.

కోడి కత్తి ఎపిసోడ్‌తో తమ నేత, వైసీపీ అధినేత జగన్‌ను నిలువునా చంపాలనుకున్నారని రెడ్డి సామాజిక వర్గం ప్రజలు బాబుపై గుర్రుగా ఉన్నారు. ఇటు, గత ఎన్నికలలో తమ అభిమాన కథానాయకుడు, రాజకీయ నాయకుడు జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ని వాడుకొని నేడు వదిలేశాడని కాపు సామాజిక వర్గం ఓటర్లు నిప్పులు చెరుగుతున్నారు. వీరంతా ఇప్పుడు బాబుపై, ఆయన సామాజిక వర్గంపై మండి పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.