కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ క్లోజ్ : యూత్ కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ ఫొటో ఔట్

January 2, 2019

ఓటమి ఎంత ఘోరంగా ఉంటుందో.. ఎన్ని చారిత్రక తప్పులకు సాక్ష్యంగా నిలుస్తుందో.. ఓటమి తర్వాత నీడ కూడా కనిపించదన్నట్లుగా కుంగిపోయారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల ముందు వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఓ రేంజ్ లో ఉంది.. వీర పబ్లిసిటీ, టీఆర్ఎస్, కేసీఆర్ కు కౌంటర్ ఎటాక్ కోసం ప్రత్యేకంగా 100 మంది పని చేశారు. ఎన్నో గ్రూప్స్ నిరంతరం అప్ డేట్ చేస్తూ వచ్చింది. పోలింగ్ ముగిసింది.. ఫలితాలు వచ్చాయి.. డిసెంబర్ 11వ తేదీ తర్వాత ఒక్క పోస్టు అంటే ఒక్క పోస్టు పేస్ బుక్ లో పెట్టలేదు. డిసెంబర్ 4వ తేదీన పోలింగ్ కు రెండు రోజుల ముందు సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం వీడియోను పిన్ ట్యాప్ చేశారు. డిసెంబర్ 7వ తేదీ పోలింగ్ రోజున ఓటేయటం మరిచిపోకండి అంటూ ఓ ఇమేజ్ పెట్టారు. అంతే.. ఆ తర్వాత మళ్లీ ఫేస్ బుక్ యాక్టివ్ కాలేదు. ఎలాంటి పోస్టు నమోదు కాలేదు.


ఇక తెలంగాణ యూత్ కాంగ్రెస్ అఫిషియల్ పేజీ ఉంది. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోను ఎత్తివేశారు. ఈ పేజీ యాక్టివ్ గా ఉన్నా.. డిసెంబర్ 11వ తేదీ ఫలితాల తర్వాత నుంచి ఉత్తమ్ ఫొటో మాయం అయ్యింది. రాహుల్ తోపాటు ఇతర నేతలు ఫొటోలు పెడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా తెలంగాణ గురించి వార్తలు, అప్ డేట్స్ అస్సలు ఉండటం లేదు. జాతీయ రాజకీయాలపైనే ఉంటున్నాయి. అవి కూడా నేషనల్ కాంగ్రెస్ ట్విట్టర్ నుంచి తీసుకుని షేర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఓటమి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ మొత్తం మాయం కావటం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. అక్కడి టీం ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎక్కడ ఉందో కూడా ఆచూకీ లేదు. మొత్తం వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక ఉత్తమ్ కూడా వాళ్లకు అందుబాటులో రాలేదంట. కనీసం రెస్పాన్స్ కూడా కావటం లేదంట. పాపం వాళ్లకు డబ్బులు అయినా ఇచ్చారో లేదో కదా.. ఇవ్వకపోతే మాత్రం అన్యాయమే. 70 ఏళ్ల చరిత్రలో కనీసం పత్రిక, టీవీ పెట్టుకోలేకపోయారు.. కనీసం సోషల్ మీడియాను అయినా సైతం పెట్టుకోండి.. భవిష్యత్ లో అయినా పలికొస్తుంది. లేకపోతే సంకనాకిపోతారు రే.. సంకనాకిపోతారు…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.