ఇందుకేనా.. బిత్తిరి సత్తిని TV9 టార్గెట్ చేస్తుంది!

February 4, 2019

పద్దతిగా నాలుగు మాటలు చెబితే బూతులుగా వినిపిస్తున్నాయి టీవీ9 ఛానల్ కు. చక్కగా బట్టలు వేసుకో అమ్మా.. కొంచెం కనిపించినా విప్పి తిరుగుతున్నావ్ అనే సమాజంలో ఉన్నాం.. తెల్లకాగితంపై నల్లటి చుక్క మాత్రమే కనిపిస్తుంది అంటూ మాట్లాడిన బిత్తిరి సత్తి మాటలు వెలికిగా ఉన్నాయా టీవీ9కి. సత్తి మాట్లాడిన మాటలు విన్నోళ్లకు ఇందులో తప్పేముందీ అనే మాట సహజంగా వచ్చేసింది.. అంటే టీవీ9 కావాలనే టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
బాలయ్య కడుపు మాటలు వినిపించలేదా?
కనిపిస్తే కడుపు చేసేయాలంట. ద గ్రేట్ యాక్టర్ బాలకృష్ణ అన్న మాటలు మాత్రం వినిపించలేదు.. కనిపించలేదు. ఏం.. ఎందుకు.. ఏ కులం వాడని బాలయ్య మాటలు వినసొంపుగా వినిపించాయి. ఏ ప్రాంతం వాడని సమ్మగా అనిపించాయి టీవీ9కి నెటిజన్ కామన్ క్వశ్చన్. ఎప్పుడూ బూతులు మాట్లాడే అలీతోపాటు మరో నటుడు చలపతిరావుతో పోల్చి మరీ బిత్తిరిని టార్గెట్ చేయటం వెనక ఉద్దేశం కులమా – ప్రాంతీయమా. నరనరాల జీర్ణించుకున్న సామాజిక వర్గం అహంకారం టీవీ9 స్టోరీలో కనిపించటం లేదని ఎలా అనుకోగలం.
టీవీ9 ఆఫర్ తిరస్కరించినందుకే టార్గెట్ అయ్యాడా?
బిత్తిరి ఫొటో పెట్టి వెకిలి కామెంట్లు అంటూ శ్రీముఖితో అన్న మాటలను హైలెట్ చేశాయి. బిత్తిరి అన్న మాటల కంటే.. జబర్ధస్త్ షోలోనే మరిన్ని ఎక్కువగా వస్తాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇంట్లో ఆడోళ్ల ముందు ఉన్న మగాళ్లే సిగ్గుతో చచ్చిపోవాలి. అలాంటి డైలాగ్స్ ను వదిలేసి.. బాలయ్య ఫొటో కూడా వేయకుండా బిత్తిరిని కార్నర్ చేయటం వెనక ప్రధాన కారణం.. టీవీ9 అక్కసు. మూడేళ్లుగా టీవీ9 నుంచి బిత్తిరికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు నో చెబుతున్నాడు. భారీ ఆఫర్ ఇచ్చినా తిరస్కరించాడు. బిత్తిరిని కార్నర్ చేయటం వెనక ప్రధాన కారణం ఇదే.
వాళ్లు చూసే కళ్లు, చేసే పనులే నిజం అనుకుంటారా : దేవరకొండ విషయంలోనూ అంతే కదా..
విజయ్ దేవరకొండ. తెలంగాణ మెగాస్టార్ అనే పాపులారిటీ సంపాదించాడు. గతంలో టీవీ9 చేసిన ఇంటర్వ్యూలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. ఒకే ప్రశ్నను పదేపదే అడుగుతూ.. తప్పు చేస్తున్నాడు.. బూతు చూపిస్తున్నాడు అని కన్విన్స్ చేయటానికి ఎంత తాపత్రయం పడిందో యాంకరమ్మ. అప్పుడే కాదు.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అసెంబ్లీనే కించపరుస్తూ తన వైఖరిని బయటపెట్టుకుంది. వెండితెర స్టార్ దేవరకొండనే బూతు నటుడిగా చిత్రీకరించేందుకు ఎంత తాపత్రయపడింది. బాలయ్య బూతులు మాత్రం వీళ్లకి కనిపించవు. ఇప్పుడు అసలు లేని వెకిలిని.. బిత్తిరిని ఆపాదించటానికి చేస్తున్న ప్రయత్నంలో కుట్ర లేని ఎలా అనుకుంటోంది తెలంగాణ సమాజం.
స్పైసీ స్క్రిప్ట్ టీవీ9 నుంచే వచ్చింది కదా!
ఆమె అందం పిచ్చెక్కిస్తోంది.. అందాల ఆరబోతలో ఆస్కార్ ను మించిపోతున్న బ్యూటీలు.. వెండితెరపై అందాలను సై అంటున్న కొత్త తారలు.. తమ స్కిన్ తో ప్రేక్షకుల మతి పోగొడుతున్నారు.. ఇంత కంటే గొప్పగా, సంప్రదాయంగా టీవీ9 స్క్రిప్ట్ ఉంటుందా.. అబ్బే అస్సలు ఉండదు. ఈ బూతును తెలుగు మీడియాకి పరిచయం చేసింది ఎవరు.. ఇంకెవరు.. వాళ్లే. బూతును పలు కోణాలు వినిపిస్తూ.. వెకిలిని బూతుగా మార్చటం ఏంటీ..
శ్రీరెడ్డి మాటలు సుప్రభాతమా?
మాద.. ద్. ఇలాంటి మాటలను మాట్లాడించే టీవీ9.. బిత్తిరి సత్తిని వెకిలి స్టార్ గా చిత్రీకరించటం వెనక ఎవరి కుట్ర ఉంది.. ఎవరి ప్రమేయం ఉంది. బట్టలు నిండుగా కప్పుకో శ్రీముఖి.. భుజం దగ్గర కనిపించే డిజైనింగ్ వల్ల కూడా అందరూ అటువైపే చూస్తారు.. అందరి కళ్లు అటే ఉంటాయి అంటూ చెప్పాడు. శ్రీముఖి కూడా పద్దతిగానే మాట్లాడింది. పద్దతిగా ఉంటే అన్నం పప్పుచారు అంటారు అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో బూతు లేదు.. వెకిలి ఏముందో కూడా అర్థం కాలేదు.. చూసే కళ్లు.. చేసే పనులను బట్టే మన ప్రవర్తన ఉంటుంది అంటారు.. మరి టీవీ9 బిత్తిరి సత్తి విషయంలో ఎలా ఆలోచిస్తుందో.. ఎందుకు కక్ష కట్టిందో.. ఎందుకు కుట్ర చేస్తుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఏంటీ….


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.