ఆయన అంతరిక్షంలోకి వెళతారు : కలర్ మీడియా న్యూ కోటింగ్

January 5, 2019

ఇస్రో గగనయాన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది.. ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.. 10వేల కోట్ల ప్రాజెక్ట్.. అయితే ఓ వార్త, కామెంట్ సోషల్ మీడియాలో విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేంటంటే.. అంతరిక్షంలోకి ఆయన వెళతారు.. కలర్ మీడియా పంపిస్తోంది.. ముగ్గురు అస్ట్రోనాట్స్ లో ఆయన ఒకరు.. ఎందుకంటే నేటి స్మార్ట్ యుగాన్ని ఆయనే కనిపెట్టారు.. టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేశారు.. అంతరిక్షంలోకి వెళ్లటానికి ఆయనకు ఇంతకు మించి అర్హత లేదు కదా.. అంతేకాదండీ.. ఆయన దగ్గరే భారత వ్యోమగాములు కోచింగ్ కూడా తీసుకోబోతున్నారంట.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఆయనే.. ఆయన.. ఆయన వచ్చిన తర్వాత ప్రపంచం కూడా ప్రపంచ పటంలో గుర్తింపు పొందింది..
ఇలాంటి కామెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో వస్తుంది.. కలర్ మీడియా మాత్రం న్యూ కోటింగ్ మొదలుపెట్టింది. అవును ఆయన అంతరిక్షంలోకి వెళ్లొచ్చు.. ఎందుకంటే అది ఉన్నది కూడా ఆయన రాష్ట్రంలోనే కదా అంటూ ఓ విశ్లేషణతో కూడిన గోబెల్స్ ప్రచారం మొదలుకాబోతున్నది. ఇప్పటి వరకు ప్రపంచాన్ని గెలిచినా.. ప్రపంచాన్ని దేశానికి పరిచయం చేసిన ఆయన అంతరిక్షంలోకి కూడా వెళితే చిరస్థాయిగా.. అంతరిక్ష పటంలో నిలిచిపోవటం ఖాయంగా భావించి మరీ ఈ సాహస వార్తలకు కంకణం కట్టుకున్నట్లు వార్తలు లీక్ కావటం.. అందర్నీ సంభ్రమాశ్చర్యంలోకి తీసుకెళుతోంది. కలర్ మీడియా న్యూ కోటింగ్ పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.. ఎప్పుడెప్పుడు ఆ వార్తలు వస్తాయా అని కోట్లాది నెటిజన్ల కళ్లు వత్తులు వేసుకుని మరీ చూస్తున్నాయి.
నిజం చెప్పినా తిట్టాడని.. ఉన్న మాట అన్నా ఎందుకంత కోపం అంటూ ఎవరో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి మరీ.. తనకు అనుకూలంగా మలచుకునే కలర్ మీడియా.. అదే తరహాలో ఆయన్ను అంతరిక్ష పితామహుడుగా చరిత్రలో నిలిపేందుకు ఎంతో ఉత్సాహంగా అడుగులు వేయటం మంచి పరిణామంగా నెటిజన్లు కీర్తిస్తున్నారు. ఏమైనా ఆయన వస్తేనే కాదు.. ఆయన అంతరిక్షంలోకి వెళితేనే మా రాతలకు, కృషికే కాదు.. మా జన్మకు సార్థకంగా భావిస్తోంది. మీ కోరిక వెంటనే నెరవేరాలని, ఇస్రో కూడా ఆయన్ను అంతరిక్షంలోకి పంపే ముగ్గురిలో ఒకరిగా ఎంపిక చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలర్ మీడియా.. న్యూ కోటింగ్ కు వందనాలు..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.