అమృత కడుపున పుట్టిన ప్రణయ్

January 24, 2019

పెళ్లయిన కొన్ని రోజులకే అమృత తండ్రి కిరాతకానికి బలయ్యాడు ప్రణయ్. అప్పటికే అమృత గర్భవతి. ఇప్పుడు అమృత బిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయి పుట్టాడు. అచ్చం ప్రణయ్ లాగే ఉన్నాడని అంటున్నారు. ప్రణయ్ మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు. మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జనవరి 23వ తేదీ పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది అమృత. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

ప్రణయ్ మళ్లీ పుడతాడు అంటూ అమృత చాలా సందర్భాల్లో.. ఇంటర్వ్యూలు చెబుతూ వచ్చింది. అన్నట్లుగానే మగబిడ్డకు జన్మనివ్వటంతో ప్రణయ్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. పుట్టిన బిడ్డలో ప్రణయ్ ను చూసుకుంటున్నామని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ప్రణయ్ హత్య జరిగిన నాటికి అమృత ఐదు నెలల గర్భిణి. మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని వస్తుండగా అమృత తండ్రి పంపించిన హంతకులు.. అత్యంత దారుణంగా చంపేశారు. పోలీస్ విచారణలోనూ ఇదే విషయాన్ని తెలిపాడు మారుతీరావు. ఆ తర్వాత ప్రాణహాని ఉందంటూ అమృత పోలీస్ సెక్యూరిటీ కోరింది. అప్పటి నుంచి ఆమె ఇంటి దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.